‘గోల్డ్ మ్యాన్’ చిన్ని గౌడ్ కేసులో ఐటీ శాఖ దూకుడు..
ABN , Publish Date - Nov 23 , 2026 | 07:21 PM
తెలంగాణ గోల్డ్ మ్యాన్ యాదగిరి చిన్న గౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ కేసులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దూకుడు పెంచారు. రాయదుర్గ్‌లో బినామీ ఆస్తిని గుర్తించారు. చిన్న గౌడ్ బావమరిది యాదగిరి ప్రణయ్ గౌడ్ పేరుతో ఉన్న భవనంపై చర్యలు తీసుకున్నారు.
హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ గోల్డ్ మ్యాన్ యాదగిరి చిన్న గౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ కేసులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దూకుడు పెంచారు. రాయదుర్గ్‌లో బినామీ ఆస్తిని గుర్తించారు. చిన్న గౌడ్ బావమరిది యాదగిరి ప్రణయ్ గౌడ్ పేరుతో ఉన్న భవనంపై ఐటీ అధికారులు చర్యలు తీసుకున్నారు. రాయదుర్గ్ నివాస భవనంతో పాటు అద్దెకు వచ్చిన ఆదాయాన్ని కూడా జప్తు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఐదు అంతస్తుల భవనం.. ప్రతి అంతస్తులో రెండు 2BHK ఫ్లాట్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు. 2019లో భూమి కొనుగోలు సమయంలో ప్రణయ్ గౌడ్‌కు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం లేకపోవడంపై ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
222 గజాల స్థలాన్ని రూ.26.7 లక్షలకు కొనుగోలు చేసినట్లుగా ఐటీ అధికారుల దర్యాప్తులో తేలింది. భూమి కొనుగోలు, భవన నిర్మాణానికి తానే డబ్బులు ఇచ్చినట్లుగా విచారణలో యాదగిరి చిన్న గౌడ్ బావమరిది వెల్లడించారు. ఈ భవనాన్ని నెలకు రూ.3.2 లక్షలకు అద్దెకు ఇచ్చినట్లుగా గుర్తించారు. గోల్డ్ మ్యాన్ వ్యవహారంపై టీవీ, యూట్యూబ్ ఇంటర్వ్యూలను అధికారులు పరిశీలించారు. 900 గ్రాముల బంగారంలో లెక్కల్లో చూపని 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారుగా రూ.కోటి ఉన్నట్లుగా తెలుస్తోంది. అద్దెలు, భూముల లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయంపై ఐటీ అధికారులు ఆరా తీశారు. ప్రతి ఏడాది కేవలం రూ.4 లక్షల ఆదాయం మాత్రమే చిన్ని గౌడ్ చూపిస్తున్నట్లుగా ఐటీ రిటర్నుల్లో అధికారులు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!
తెలంగాణలో ష్నైడర్ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News