Share News

ఐటీ కారిడార్‌లో 6.30 ఎకరాలకు హైడ్రా రక్షణ

ABN , Publish Date - Mar 03 , 2026 | 10:17 AM

ఐటీ కారిడార్‌ సమీపంలోని గంధంగూడలో 6.30 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది.

ఐటీ కారిడార్‌లో 6.30 ఎకరాలకు హైడ్రా రక్షణ

- రూ. 600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్‌

హైదరాబాద్‌ సిటీ: ఐటీ కారిడార్‌ సమీపంలోని గంధంగూడలో 6.30 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా(HYDRAA) కాపాడింది. దీని విలువ రూ.600 కోట్ల వరకు ఉంటుందని అంచనా. గండిపేట మండలం గంధంగూడ సర్వే నంబరు 86/పిలో 6.30 ఎకరాల ప్రభుత్వ భూమిని వాటర్‌బోర్డుకు సర్కార్‌ కేటాయించింది.


city6.jpgఅయితే ఈ స్థలంలో కొంతమంది ఆక్రమణలకు పాల్పడుతూ కొన్ని షెడ్డులు వేశారు. వాటర్‌బోర్డు నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు మున్సిపల్‌, రెవెన్యూ అధికారులతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ భూమిలో వెలిసిన షెడ్డులను తొలగించారు. భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌ వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

హోలీ హంగామా!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 03 , 2026 | 10:17 AM