మదర్ డెయిరీ నిర్వహణ ఎన్‌డీడీబీ చేతికి
ABN , Publish Date - Mar 03 , 2026 | 03:54 AM
నిర్వహణ కొరవడి, ఆర్థిక కష్టాల్లో ఉన్న మదర్ డెయిరీని గట్టెక్కించేందుకు, దాదాపు 15 నుంచి 20 ఏళ్ల పాటు డెయిరీ నిర్వహణ బాధ్యతలను తీసుకునేందుకు జాతీయ ......
మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి
హయత్‌నగర్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): నిర్వహణ కొరవడి, ఆర్థిక కష్టాల్లో ఉన్న మదర్ డెయిరీని గట్టెక్కించేందుకు, దాదాపు 15 నుంచి 20 ఏళ్ల పాటు డెయిరీ నిర్వహణ బాధ్యతలను తీసుకునేందుకు జాతీయ పాడి అభివృద్ధి బోర్డు(ఎన్‌డీడీబీ) అంగీకరించిందని మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. మదర్ డెయిరీ డైరెక్టర్లతో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అహ్మదాబాద్ వేదికగా ఎన్‌డీడీబీ చైర్మన్ మీనేశ్ షాతో ఇటీవల జరిపిన చర్చలు సఫలమయ్యాయని తెలిపారు. పది రోజుల్లో దీనికి సంబంధించిన ఎంఓయూ కుదిరే అవకాశం ఉందని వివరించారు. డెయిరీని గట్టేక్కించేందుకు కావాల్సిన రూ. 75 కోట్ల నిధులను అందించేందుకు ఎన్‌డీడీబీ చైర్మన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.