Share News

హైదరాబాద్ జలమండలి మొబైల్ అప్లికేషన్‌లో సాంకేతిక సమస్య

ABN , Publish Date - Aug 08 , 2026 | 03:38 PM

హైదరాబాద్ జలమండలి సిటిజన్ సర్వీసెస్ మొబైల్ అప్లికేషన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా ట్యాంకర్ బుకింగ్ చేసుకునే సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడిందని జలమండలి అధికారులు తెలిపారు.

హైదరాబాద్ జలమండలి మొబైల్ అప్లికేషన్‌లో సాంకేతిక సమస్య
Hyderabad Water Board

హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ జలమండలి (Hyderabad Water Board) సిటిజన్ సర్వీసెస్ మొబైల్ అప్లికేషన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా ట్యాంకర్ బుకింగ్ చేసుకునే సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడిందని జలమండలి అధికారులు తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి జలమండలి సాంకేతిక బృందం చర్యలు చేపట్టిందని వివరించారు. IVRS ద్వారా ట్యాంకర్ బుకింగ్ సేవలు యథావిధిగా కొనసాగిస్తున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.


జలమండలి అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ట్యాంకర్ బుకింగ్‌ చేసుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ మొబైల్ అప్లికేషన్ సేవలు పునరుద్ధరించే వరకు IVRS, వెబ్‌సైట్ సేవలను వినియోగించుకోవాలని వినియోగదారులకు సూచించారు. సాంకేతిక సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి మొబైల్ అప్లికేషన్ సేవలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపడతామని చెప్పుకొచ్చారు. తాత్కాలిక అంతరాయంపై వినియోగదారులు సహకరించాలని జలమండలి అధికారులు విజ్ఞప్తి చేశారు.


వార్తలు కూడా చదవండి...

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఆ పాఠశాలకు నూతన సొబగులు

జీసీసీలకు తెలంగాణే బెస్ట్ డెస్టినేషన్: మంత్రి శ్రీధర్ బాబు

క్షుద్ర పూజల విషయంలో హరీశ్‌రావు వివరణ ఇవ్వాలి: మహేశ్ గౌడ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 08 , 2026 | 03:56 PM