Share News

ప్రగతి చక్రం.. పొదుపు మంత్రం

ABN , Publish Date - Jun 18 , 2026 | 09:44 AM

ఇంధన సంక్షోభం, ధరల పెరుగుదల నేపథ్యంలో గ్రేటర్‌ ఆర్టీసీ డీజిల్‌ భారం తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది.

ప్రగతి చక్రం.. పొదుపు మంత్రం
TGSRTC

  • డీజిల్‌ రోజువారీ ఖర్చు రూ.1.33 కోట్లు

  • మైలేజీ పెంపునకు డ్రైవర్లకు శిక్షణ

  • 2027 డిసెంబర్‌ లోగా ఈవీ జోన్‌

హైదరాబాద్‌ సిటీ: ఇంధన సంక్షోభం, ధరల పెరుగుదల నేపథ్యంలో గ్రేటర్‌ ఆర్టీసీ డీజిల్‌ భారం తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది. గ్రేటర్‌ జోన్‌లో ఆర్టీసీ 3,250 బస్సులు నడుపుతుంది. వాటిలో 2,700 డీజిల్‌ బస్సులు, 550 ఈవీ బస్సులున్నాయి. 26 డిపోల్లో రోజు 1.36 లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగిస్తూ 7.5 లక్షల కిలోమీటర్ల వరకు బస్సులు నడుస్తున్నాయి. లీటర్‌కు రూ.98 వ్యయంతో ప్రతీరోజు రూ.1.33 కోట్లు డీజిల్‌పై ఖర్చుచేస్తున్నారు.


ఆర్టీసీకి వస్తున్న ఆదాయంలో 30 శాతానికిపైగా డీజిల్‌కే ఖర్చుచేయాల్సి రావడంతో అప్పులు పెరుగుతున్నాయి. సంస్థపై పడుతున్న నిర్వహణ భారం తగ్గించుకునేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తుంది. డిపోల స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ, వాహనాల ఫిట్‌నె్‌సతో పాటు ఉత్తమ నిర్వహణ పద్ధతులను నిరంతరం అలవర్చుకునేలా డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నారు.


డిపోలలో డీజిల్‌ ఆదా చేస్తున్న డ్రైవర్లకు ప్రత్యేక ప్రోత్సాహాలు అందిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. బస్సుల డీజిల్‌ మైలేజీని (కేఎంపీఎల్‌)పెంచడానికి, గ్యారేజ్‌ పరిధిలో సాంకేతిక లోపాలను సకాలంలో గుర్తించి నివారించుకునేందుకు డిపోల్లో ఉన్న సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. నగరంలో లీటర్‌ డీజిల్‌తో 5.13 కిలోమీటర్లు నడుపుతున్న బస్సులు మరింత మైలేజీ పెంచుకునేలా డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు.


city4.2.jpgదశలవారీగా ఈవీ

2027 డిసెంబర్‌ నాటికీ గ్రేటర్‌జోన్‌ను ఈవీ జోన్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. రెండేళ్లలో గ్రేటర్‌జోన్‌లో కేవలం ఈవీ బస్సులే నడపాలని, గ్రేటర్‌ అవతల డీజిల్‌ బస్సులు నడపాలనే ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీ దశలవారీగా ఈవీ బస్సులను తీసుకు వస్తోంది. గ్రేటర్‌జోన్‌లో 550 ఎలక్ర్టిక్‌ బస్సులను అన్ని రూట్లలోనూ నడుపుతోంది. గ్రేటర్‌జోన్‌ ఈవీ జోన్‌గా మారితే డీజిల్‌ భారం ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం అండతో రాబోయే రోజుల్లో సొంతంగా ఈవీ బస్సులు కొనుగోలు చేయబోతోందని ఆర్టీసీలోని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

20న రెండు ఎంఎంటీఎస్‏లు రద్దు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 18 , 2026 | 09:44 AM