Share News

స్కూల్‌పై దాడి.. ఎవరూ కావాలని చేయలేదు: ట్రంప్

ABN , Publish Date - Jun 18 , 2026 | 08:42 AM

ఇరాన్‌పై యుద్ధంలో తొలి రోజున స్కూల్‌పై జరిగిన దాడిలో చిన్నారులు మరణించడంపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. ఎవరూ కావాలని ఆ దాడి చేయలేదని స్పష్టం చేశారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అన్నారు.

స్కూల్‌పై దాడి.. ఎవరూ కావాలని చేయలేదు: ట్రంప్
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌లు ఫిబ్రవరి 28న తొలిసారిగా దాడులకు దిగాయి. ఈ క్రమంలో ఒక స్కూలుపై బాంబులు పడటంతో 175 మందికిపైగా చిన్నారులు, టీచర్లు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. స్కూలుపై ఎవరూ కావాలని దాడి చేయలేదని పేర్కొన్నారు. ఈ అంశంపై ఇంకా దర్యాప్తు జరుగుతోందని కూడా చెప్పారు. ఫ్రాన్స్‌లో జీ- 7 సమావేశాల సందర్భంగా బుధవారం విలేకరులతో ఈ వ్యాఖ్యలు చేశారు.

మినాబ్ ప్రాంతంలోని ఓ స్కూల్‌పై ఈ దాడి జరిగింది. ఈ ఘటనకు అమెరికా సైన్యం కారణమై ఉండవచ్చని రాయిటర్స్ వార్తా సంస్థ అప్పట్లో ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ తరువాత అమెరికా రక్షణ శాఖ ఈ విషయంపై లోతైన దర్యాప్తు ప్రారంబించింది. అయితే, ప్రాథమిక స్థాయిలో కీలక అంశాలు ఏవైనా వెలుగులోకి వచ్చాయా? లేదా? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.


ఈ అంశంపై ట్రంప్ గతంలో కూడా స్పందించారు. దాడికి ఇరాన్‌దే బాధ్యత అని మొదట్లో అన్నారు. అయితే, దాడికి సంబంధించి పూర్తి వివరాలు తన వద్ద లేవని ఆ తరువాత పలు సందర్భాల్లో చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. దర్యాప్తులో ఏ విషయం వెలుగులోకి వచ్చినా తమకు అంగీకారమేనని కూడా చెప్పారు. ఇక ఈ దాడిపై గత నెలలో అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా స్పందించింది. ఈ అంశంపై దర్యాప్తు ఎంతో సంక్లిష్టమైనదని చెప్పుకొచ్చింది. స్కూల్ సమీపంలో ఇరాన్ మిసైల్ స్థావరాలు అనేకం ఉన్నందున అసలేం జరిగిందనేది తేల్చడం సంక్లిష్టంగా మారిందని వివరించింది.


ఈ వార్తలనూ చదవండి:

శాంతి ఒప్పందంపై సంతకం చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..

అంతరిక్ష యాత్రకు ఇండో అమెరికన్‌ వ్యోమగామి

Updated Date - Jun 18 , 2026 | 08:57 AM