అంతరిక్ష యాత్రకు ఇండో అమెరికన్ వ్యోమగామి
ABN , Publish Date - Jun 18 , 2026 | 06:40 AM
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా జూలై 14న చేపట్టనున్న అంతర్జాతీయ అంతరిక్ష యాత్రకు ఇండో అమెరికన్ అయిన అనిల్ మేనన్ వెళ్లనున్నారు....
వాషింగ్టన్, జూన్ 17: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా జూలై 14న చేపట్టనున్న అంతర్జాతీయ అంతరిక్ష యాత్రకు ఇండో అమెరికన్ అయిన అనిల్ మేనన్ వెళ్లనున్నారు. మరో ఇద్దరు వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవ్, అన్నా కికినాలతో కలిసి ఆయన ఈ యాత్ర జరపనున్నారు. వీరు 240 రోజులపాటు అంతరిక్షంలో గడపనున్నారు. జూన్ 22న ఈ యాత్రకు సంబంధించి అనిల్ మేనన్ ఇంటర్వ్యూలు ఇస్తారని నాసా తెలిపింది. 2021లో వ్యోమగామిగా ఎంపికైన అనిల్ భారత, ఉక్రెయిన్ తల్లిదండ్రులకు జన్మించిన అమెరికన్ పౌరుడు. 2024లో ఆస్ట్రోనాట్ క్లాస్ గ్రాడ్యుయేట్ అయ్యారు. అంతకుముందు హార్వర్డ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, స్టాన్‌ఫోర్డ్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్, మెడికల్‌లో మాస్టర్ డిగ్రీలను అందుకున్నారు. వ్యోమగామి కాక ముందు నాసా ఎక్స్‌పెడిషన్ ఫ్లైట్ సర్జన్‌గానూ పనిచేశారు.
ఇవీ చదవండి:
సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్