20న రెండు ఎంఎంటీఎస్‌లు రద్దు
ABN , Publish Date - Jun 18 , 2026 | 08:36 AM
హైదరాబాద్ నగరంలోని వివిధ మార్గాల్లో నడుస్తున్న రెండు ఎంఎంటీఎస్ రైళ్లను ఈనెల 20న రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
కాచిగూడ-డోన్ సెక్షన్లో ట్రాక్ నిర్వహణ పనులు
హైదరాబాద్ సిటీ: నగరంలోని వివిధ మార్గాల్లో నడుస్తున్న రెండు ఎంఎంటీఎస్ రైళ్లను ఈనెల 20న రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రధానంగా కాచిగూడ-డోన్ సెక్షన్లో ట్రాక్ మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు. రద్దయిన రైళ్లలో మేడ్చల్ నుంచి లింగంపల్లి మార్గంలో నడిచే 47222 రైలు, ఉమ్డానగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే 47252 ఎంఎంటీఎస్ రైళ్లు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం
Read Latest AP News And Telangana News And International News And Telugu News