హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 9:30గంటల నుంచి కరెంట్ కట్..
ABN , Publish Date - Jun 18 , 2026 | 07:24 AM
హస్తినాపురం డివిజన్ నందనవనంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మరమ్మతులు, చెట్లకొమ్మల తొలగింపు కారణంగా గురువారం విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ బాల్‌రాజ్ తెలిపారు.
హైదరాబాద్: హస్తినాపురం డివిజన్ నందనవనంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మరమ్మతులు, చెట్లకొమ్మల తొలగింపు కారణంగా గురువారం విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ బాల్‌రాజ్ తెలిపారు. 11కేవీ లలితానగర్ విద్యుత్ ఫీడర్ పరిధిలోని గాయత్రీనగర్, గాయత్రీ హోమ్స్, దేవి గాయత్రీనగర్, శ్రీ గాయత్రీనగర్, వెంకటసాయి కాలనీ, జిల్లెలగూడ విలేజ్‌లో ఉదయం 9:30గంటల నుంచి 12గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. 11కేవీ నందీహిల్స్ ఫీడర్ పరిధిలోని టీచర్స్‌కాలనీ, నాగార్జున కాలనీ, చైతన్యహిల్స్, నందీహిల్స్ రోడ్ నుం2-22, శిగంగాహిల్స్, ప్రశాంత్‌హిల్స్‌లో మధ్యాహ్నం 2:30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ తెలిపారు.
టీజీఎస్‌పీడీసీఎల్ ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలో..
సైదాబాద్: టీజీఎస్పీడీసీఎల్ ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. 11కేవీ సైదాబాద్ కాలనీ, దిల్‌సుఖ్‌నగర్, పల్టన్, ధర్మవంత్ కాలేజ్, జీఎం నగర్ ఫీడర్ల పరిధిలోని పరిసర ప్రాంతాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఎంఆర్‌ఓ ఆఫీస్, జీఏ బ్యాంకు కాలనీ, దర్గా, సెవన్ టెంపుల్, జడ్జస్ కాలనీ, మాతాకీ కిడికి ఫీడర్ల పరిధిలోని పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ తెలిపారు.
అబ్దుల్లాపూర్‌మెట్ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో..
అబ్దుల్లాపూర్‌మెట్: అబ్దుల్లాపూర్‌మెట్ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో చెట్ల కొమ్మల నరికివేత కారణంగా పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ నరేందర్‌నాయక్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇనాంగూడ, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అబ్దుల్లాపూర్‌మెట్, కవాడిపల్లి, ఇండస్ర్టీరియల్, వ్యవసాయ విద్యుత్ పవర్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ తెలిపారు.
చిక్కడపల్లి: హైదరాబాద్ సిటీ-1, ఆజామాబాద్ డివిజన్ పరిధిలో గురువారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు వినోద్‌కుమార్, నరేంద్రరాజు తెలిపారు. ఏవీ కాలేజ్, గగన్‌మహల్, మీరా థియేటర్, లక్డీకాపూల్, కింగ్‌కోఠి, శంకర్‌మఠ్, సాయిబాబా టెంపుల్, ఆజామాబాద్ ఐ.ఇ, ఆప్కో ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, నవీన్‌నగర్, ఎర్రమంజిల్, అంబేడ్కర్‌నగర్, లిటిల్‌ఫ్లవర్, బ్రాహ్మణ్ హాస్టల్, ఇందిరానగర్, రామ్‌నగర్, ఆజామాబాద్ కీ, నల్లకుంట, గాంధీకుటీర్, కేశవ్ మెమోరియల్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామన్నారు.
మల్కాజిగిరి: మరమ్మతుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని వినాయకనగర్ విద్యుత్ సబ్ స్టేషన్ ఏఈ సుమన్ క్రిస్టియానా తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కృపా కాంప్లెక్స్, శ్రీకృష్ణానగర్, సీతారాంనగర్, సైనిక్‌నగర్, రామబ్రహ్మనగర్, దేవీనగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.
బృందావన్ కాలనీ ఫీడర్ పరిధిలో..
నేరేడ్‌మెట్: బృందావన్ కాలనీ ఫీడర్ పరిధిలో గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సప్తగిరి కాలనీ, జీకే కాలనీ, ప్రేమ్‌నర్, వివేకానందపురం రోడ్డు నెంబర్ ఒకటి, రెండు, మాతృపురి కాలనీ, బృందావన్ కాలనీ, రాఘవేంద్రనగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ జి. లత తెలిపారు.
ఉప్పల్‌లో..
ఉప్పల్: చెట్ల కొమ్మల తొలగింపు, నిర్వహణ పనుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఉప్పల్ భగాయత్ ఏఈ (ఆపరేషన్) బి.కిరణ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్‌ఎన్ నగర్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భారత్‌నగర్, బాలాజీ నగర్, చైతన్య భారతి స్కూల్ లేన్, రాజేంద్ర నగర్, టీవీ కాలనీ, గాంధీ నగర్, చర్చ్ కాలనీ, శ్రీరామపురం, అరవింద నగర్, నేతాజీ నగర్, జనప్రియ అపార్ట్‌మెంట్లు, రామిరెడ్డి నగర్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాయికృష్ణ కాలనీ, కేసీఆర్ నగర్, కేటీఆర్ నగర్, వెంకటసాయి నగర్, బాలకృష్ణ నగర్, శ్రీరామ కాలనీ, వెంకటేశ్వరస్వామి ఆలయ వీధి, గాంధీనగర్ రోడ్ నెం.3, శ్రీనగర్ కాలనీ హనుమాన్ ఆలయ వీధి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ పేర్కొన్నారు.
మౌలాలి సబ్‌స్టేషన్ పరిధిలో..
కాప్రా: పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని మౌలాలి సబ్‌స్టేషన్ ఏఈ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కృష్ణానగర్ ఫీడర్ పరిధిలోని మోడీ అపార్ట్‌మెంట్స్, కృష్ణానగర్‌రోడ్ నెంబర్ 3 నుంచి 11 పరిసర ప్రాంతాల్లో, వెంకటేశ్వరనగర్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు వెంకటేశ్వరనగర్, రాఘవేంద్రనగర్, ఇందిరానగర్, హెచ్‌బీ కాలనీ, డైమండ్ హిల్స్ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ పేర్కొన్నారు.
సైనిక్‌పురిలో..
కళ్యాణ్ గార్డెన్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు హస్తినాపురి, సాయిపురి, హెచ్‌ఎంటీ బేరింగ్స్ ఆఫీసర్స్ కాలనీ, నిర్మల్‌నగర్ పరిసర ప్రాంతాల్లో, విజయపురి ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయపురి, ఆయోధ్యనగర్, రుక్మిణిపురి, సైనిక్‌పురి, త్యాగరాయనగర్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ సత్యనారాయణ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం
స్వదేశీ కామికాజ్ డ్రోన్ల తయారీకి టెండర్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News