Share News

బాస్‌ పేరిట వాట్సాప్‌ మెసేజ్‌..

ABN , Publish Date - Jun 18 , 2026 | 06:43 AM

బాస్‌ పేరుతో వచ్చిన వాట్సాప్‌ మెసేజ్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీని నిండా ముంచేసింది. ఆ మెసేజ్‌ నిజమని నమ్మిన అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగి.. విడతల వారీగా ఏకంగా రూ.10 కోట్లకు పైగా...

బాస్‌ పేరిట వాట్సాప్‌ మెసేజ్‌..

ఐనాక్స్‌ కంపెనీకి రూ.10 కోట్ల టోకరా!

న్యూఢిల్లీ, జూన్‌ 17: బాస్‌ పేరుతో వచ్చిన వాట్సాప్‌ మెసేజ్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీని నిండా ముంచేసింది. ఆ మెసేజ్‌ నిజమని నమ్మిన అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగి.. విడతల వారీగా ఏకంగా రూ.10 కోట్లకు పైగా సైబర్‌ కేటుగాళ్ల ఖాతాల్లోకి బదిలీ చేశాడు. ముంబైకి చెందిన ఓ ప్రముఖ సంస్థ ఐనాక్స్‌లో జరిగిన ఈ భారీ సైబర్‌ మోసానికి సంబంధించి నలుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈనెల 3న ఐనాక్స్‌ కంపెనీలోని అకౌంట్స్‌ విభాగం డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (డీజీఎమ్‌)కు ఒక అపరిచిత నంబర్‌ నుంచి వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది. అవతలి వ్యక్తి తనని తాను కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పరిచయం చేసుకున్నాడు. అది తన వ్యక్తిగత నంబర్‌ అని, దానిని ఎవరికీ ఇవ్వొద్దని చెప్పాడు. సదరు నంబర్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌ (డీపీ)గా ఎగ్జిక్యూటివ్‌ ఫొటోనే ఉండడంతో, ఆ ఉద్యోగి నిజంగానే తన బాస్‌ మెసేజ్‌ చేశాడని నమ్మాడు. తాను ఒక అత్యవసర సమావేశంలో ఉన్నానని, కాబట్టి ఫోన్‌ చేయవద్దని ఆ నకిలీ బాస్‌ సదరు ఉద్యోగిని ఆదేశించాడు. ఆ తర్వాత కొన్ని బ్యాంక్‌ ఖాతాల వివరాలను పంపిస్తూ, కంపెనీ ఖాతా నుంచి అత్యవసరంగా డబ్బులు బదిలీ చేయాలని చెప్పాడు. బాస్‌ ఆదేశాలే కదా అని భావించిన సదరు ఉద్యోగి.. మొదటగా రూ.46.5 లక్షలు బదిలీ చేశాడు. ఇలా జూన్‌ 3 నుంచి 15 మధ్య బాస్‌ అని నమ్మిన వ్యక్తి ఆదేశాలను పాటిస్తూ ఏకంగా 63 లావాదేవీల ద్వారా ఐనాక్స్‌ కంపెనీ ఖాతా నుంచి వివిధ బ్యాంకు ఖాతాలకు రూ.10.4 కోట్లకు పైగా బదిలీ చేశాడు. మంగళవారం నాడు అకౌంట్స్‌ చెక్‌ చేసే సమయంలో, నకిలీ బాస్‌ వ్యవహారం బయటపడింది.

ఇవీ చదవండి:

సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

Updated Date - Jun 18 , 2026 | 06:43 AM