స్వదేశీ కామికాజ్ డ్రోన్ల తయారీకి టెండర్లు
ABN , Publish Date - Jun 18 , 2026 | 06:46 AM
రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా కీలక ముందడుగు పడింది. దేశీయ పరిజ్ఞానంతో సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగిన కామికాజ్ డ్రోన్ల తయారీకి భారత వాయు సేన(ఐఏఎఫ్)...
న్యూఢిల్లీ, జూన్ 17: రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా కీలక ముందడుగు పడింది. దేశీయ పరిజ్ఞానంతో సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగిన కామికాజ్ డ్రోన్ల తయారీకి భారత వాయు సేన(ఐఏఎఫ్) శ్రీకారం చుట్టింది. భారతీయ కంపెనీలు, స్టార్ట్‌పల సాయంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నట్టు ఐఏఎఫ్ పేర్కొంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ‘ఫిక్స్‌డ్ వింగ్ వన్ వే ఎటాక్ - అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్’ (వోడబ్ల్యూఏ-యూఏఎస్) అని పిలిచే కామికాజ్ డ్రోన్లను అభివృద్ధి చేసి, తయారు చేయగల సామర్థ్యం కలిగిన దేశీయ సంస్థలను గుర్తించేందుకు ఈ నెల 12న పరిమిత టెండర్లను ఆహ్వానించినట్టు ఐఏఎఫ్ వెల్లడించింది. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఉన్న సూలూరు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోని 5 బేస్ రిపేర్ డిపో (బీఆర్‌డీ) ఈ ప్రాజెక్టు అమలును పర్యవేక్షిస్తుంది. ఇదిలా ఉండగా, భారత రక్షణ రంగం సరికొత్త రికార్డు నెలకొల్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ రక్షణ రంగ ఉత్పత్తి ఏకంగా రూ.1.78 లక్షల కోట్లకు చేరి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిందని రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది.
ఇవీ చదవండి:
సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్