Share News

హైదరాబాద్‌లో రౌడీషీటర్ హత్య

ABN , Publish Date - Jul 21 , 2026 | 07:32 AM

హైదరాబాద్ నగరంలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ నందనవనం సూరి హత్యకు గురయ్యాడు.

హైదరాబాద్‌లో రౌడీషీటర్ హత్య
Hyderabad Rowdy Sheeter Suri Case

హైదరాబాద్, జులై 21 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ నందనవనం సూరి హత్యకు గురయ్యాడు. అతని హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. గతంలో పలు నేర కేసుల్లో నిందితుడిగా ఉన్న సూరిపై పోలీసులు కొన్ని నెలల క్రితం నగర బహిష్కరణ విధించిన విషయం తెలిసిందే.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో నందనవనం సూరి తన భార్యతో పాటు బావమరిది సల్మాన్‌ను హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని సల్మాన్ సోదరుడు అఫ్రోజ్ పథకం రచించాడు. సూరిని హత్య చేసేందుకు ముందుగానే అఫ్రోజ్ ప్రణాళిక రచించాడు. తన స్నేహితుడి పుట్టినరోజు కోసం సూరిని మీర్‌పేట్ పరిధిలోని టీకేఆర్ కాలేజ్ సమీపానికి అఫ్రోజ్ పిలిపించాడు.


అక్కడికి చేరుకున్న సూరిపై అఫ్రోజ్ ఒక్కసారిగా దాడికి దిగాడు. ముందుగా అతని కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి ప్రతిఘటించే అవకాశం లేకుండా చేశాడు. అనంతరం కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. రక్తస్రావంతో కుప్పకూలిన సూరిని స్థానికులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆస్పత్రికి చేరుకునేలోపే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.


ఈ ఘటనపై సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అతని హత్య వెనుక వ్యక్తిగత కక్షలు, పాత వైరమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడు అఫ్రోజ్‌తో పాటు ఘటనలో పాల్గొన్న ఇతరుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసును అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలి: ప్రధాని మోదీ

సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్‌.. ఎమ్మెల్యేల అలర్ట్

పామాయిల్ ధర పెంపునకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది: భట్టి విక్రమార్క

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 21 , 2026 | 08:20 AM