హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం.. అన్నాచెల్లెళ్ల మృతి, చిన్నారికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Oct 18 , 2026 | 02:42 PM
హైదరాబాద్ హయత్నగర్లో కారు ఢీకొనడంతో స్కూటీపై వెళ్తున్న అన్న నవీన్, చెల్లి రేఖ మృతి చెందారు. పెద్ద అంబర్పేట్కు చెందిన వీరు దసరా పండగ కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించగా, కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
హైదరాబాద్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ హయత్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లను ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పెద్ద అంబర్పేట్కి చెందిన రేఖ, నవీన్ మృతిచెందగా, చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని హుటాహుటినా హాస్పిటల్కు తరలించి వైద్యం అందిస్తున్నారు. తన చెల్లి రేఖను దసరా పండుగకు శంషాబాద్ నుంచి పెద్ద అంబర్పేట్లోని పుట్టింటికి అన్న నవీన్ తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
సమాచారం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం: డీజీపీ ఆనంద్
దసరా పండుగ రద్దీ.. టికెట్పై ఆర్టీసీ 40శాతం అదనపు ఛార్జీలు
అహ్మదాబాద్ - హైదరాబాద్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News