భాగ్యనగర వాసులకు రెయిన్ అలర్ట్.. ఈరోజు భారీ వర్షాలు కురిసే ఛాన్స్
ABN , Publish Date - Aug 03 , 2026 | 03:38 PM
భాగ్యనగరవాసులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ అలర్ట్ జారీ చేశారు. ఈరోజు రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని పేర్కొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరవాసులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ అలర్ట్ జారీ చేశారు. ఈరోజు (సోమవారం) రాత్రి వరకు భారీ వర్షాలు (Hyderabad Heavy Rain Alert) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
బయట ఉన్నవారు వెంటనే పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని సీపీ సజ్జనార్ తెలిపారు. నీరు నిలిచిన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ప్రయాణాలు చేయొద్దని హెచ్చరించారు. ముంపు ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. వాహనదారులు వేగం తగ్గించి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే నా లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి
ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ విధానమా?.. కేటీఆర్ ధ్వజం
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రజా ఉద్యమంగా నిర్వహిద్దాం: మంత్రి సీతక్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News