హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 11గంటల నుంచి పవర్ కట్
ABN , Publish Date - Aug 04 , 2026 | 07:18 AM
ఫీడర్ల మరమ్మతు కారణంగా అజామాబాద్, హైదరాబాద్ సిటీ-1 డివిజన్ల పరిధిలో మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని సీబీడీఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి. వినోద్‌కుమార్ తెలిపారు.
చిక్కడపల్లి(హైదరాబాద్): ఫీడర్ల మరమ్మతు కారణంగా అజామాబాద్, హైదరాబాద్ సిటీ-1 డివిజన్ల పరిధిలో మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని సీబీడీఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి. వినోద్‌కుమార్ తెలిపారు. అజామాబాద్ ఫీడర్ పరిధిలో ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు, సిటీ సెంట్రల్ లైబ్రరీ పరిధిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఆర్టీసీ క్రాస్‌రోడ్ పరిధిలో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు,
అజామాబాద్ ఐఈ పరిధిలో మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు, గగన్‌మహల్ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, గోశాలపరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఆర్‌వోఎమ్ పరిధిలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీఏడీఈలు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ పూర్తి చేయాలి
Read Latest AP News And Telangana News And International News And Telugu News