ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ పూర్తి చేయాలి
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:33 AM
ఎస్‌ఐఅర్ డిజిటలైజేషన్ వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి అదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుంచి రాష్ట్ర
సిరిసిల్ల అర్బన్, ఆగుస్టు 3 (ఆంఽధ్రజ్యోతి) : ఎస్‌ఐఅర్ డిజిటలైజేషన్ వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి అదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి ఎస్‌ఐఅర్ డిజిటలైజేషన్ ప్రక్రియపై కలెక్టర్ గరిమా అగ్రవాల్‌తో సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎటువంటి తప్పు లు లేకుండా చేపట్టాలన్నారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ (హేతు బద్ధీకరణ) ప్రక్రియలపై అడిగి తెలుసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓటు ఉంటే, వారిని ఒకే పోలింగ్ కేంద్రం కిందకు వచ్చేలా రేషనలైజేషన్ చేపట్టాలని సూచించారు. ఒక కుటుంబానికి చెందిన ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఓటరు జాబితాలో ఉన్న డూప్లికేట్ ఎంట్రీ లు, అనామలీస్, మ్యాపింగ్ సమస్యలు, ఏఎస్‌డీ సంబంధిత అంశాలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఫొటో మిస్‌మ్యాచ్ ఉన్న ఓటర్ల వివరాలను తప్పనిసరిగా పరిశీలించి సరిచేయాలని బీఎల్‌వో లకు ఆదేశించారు. బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి క్లెయిమ్, అభ్యంతరాన్ని ఎన్నికల నిబంధనల ప్రకారం నిష్పాక్షికంగా పరిశీ లించాలని సూచించారు. అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పూర్తి వివరాలు తెలి యజేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, తహసీల్దార్లు మహేష్, జయంత్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, ఎన్నికల సెక్షన్ అధికారి రెహమాన్, అధికారులు సిబ్బంది తదితరులు ఉన్నారు.