Share News

అసెంబ్లీ పదవీకాలం ముగిసిన పదేళ్లకు వెలువడిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

ABN , Publish Date - Aug 04 , 2026 | 06:57 AM

సంబంధిత శాసనసభ పదవీకాలం ముగిసిన పదేళ్ల తరువాత ఒక అభ్యర్థిని విజేతగా ప్రకటించిన మద్రాస్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది...

అసెంబ్లీ పదవీకాలం ముగిసిన పదేళ్లకు వెలువడిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

చెన్నై, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): సంబంధిత శాసనసభ పదవీకాలం ముగిసిన పదేళ్ల తరువాత ఒక అభ్యర్థిని విజేతగా ప్రకటించిన మద్రాస్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి, అన్నాడీఎంకే అభ్యర్థి ఇన్బదురై ఎన్నికను సవాల్‌ చేస్తూ తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్‌ ఎం.అప్పావు దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై హైకోర్టు ఆ తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు విధించిన స్టే కారణంగా 2019 నుంచి ఈ వ్యవహారం పెండింగ్‌లో ఉండడంతో హైకోర్టు ఈ ఎన్నికల పిటిషన్‌పై గత జూన్‌లో ఈ తీర్పు వెలువరించింది. అప్పావుకు నామమాత్రపు ఉపశమనం కల్పించడంతో పాటు ఇన్బదురైకి ఎమ్మెల్యే పింఛన్‌ను నిలిపివేయాలని ఆదేశిస్తూ ఈ జాప్యానికి కారణమైన సుప్రీంకోర్టును సైతం విమర్శించింది. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ ఇన్బదురై దాఖలు చేసిన అప్పీలుపై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఆదేశాల్లోని అమలుకు సంబంధించిన భాగంపై మధ్యంతర స్టే విధించింది.

ఇవి కూడా చదవండి..

విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ

బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..

Updated Date - Aug 04 , 2026 | 06:57 AM