Share News

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 10గంటల నుంచి కరెంట్ కట్

ABN , Publish Date - Jul 18 , 2026 | 07:28 AM

హైదరాబాద్ నగరంలోని ఆయా ఏరియాల్లో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు.

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 10గంటల నుంచి కరెంట్ కట్
Hyderabad power cut today

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఆస్మాన్‌ఘడ్‌ డివిజన్‌ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం 11కేవీ సూపర్‌బజార్‌ ఫీడర్‌ పరిధిలో రిలయన్స్‌ ట్రెండ్‌ మెయిన్‌ రోడ్డు, పోస్టాఫీస్‌, జాస్మీన్‌ హోటల్‌, కేజీహెచ్‌ హసికపటల్‌, సలీంనగర్‌ మున్సిపల్‌ పార్కు పరిసర ప్రాంతాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ విష్ణువర్థన్‌ రెడ్డి తెలిపారు.


నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు..

చిక్కడపల్లి: ఆజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో విద్యుత్‌ ఫీడర్ల మరమ్మతు పనుల నిమిత్తం శనివారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీఏడీఈ నరేంద్రరాజు తెలిపారు. జామై ఉస్మానియా 11కేవీ విద్యుత్‌ ఫీడర్‌ పరిధి ఉదయం 11నుంచి 11.30 గంటవరకు కరెంట్‌ సరఫరాను నిలిపివేస్తామన్నారు.


city2.jpgరాయదుర్గం: జేవీకాలనీ, కేంద్రీయవిహార్‌ విద్యుత్‌ ఫీడర్ల పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు జేవీకాలనీ, ఏపీహెచ్‌బీకాలనీ, కేంద్రీయ విహార్‌, వినాయక్‌నగర్‌, ఇందిరానగర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, ప్రశాంతిహిల్స్‌, టింబర్‌ లేక్‌ కాలనీలలో విద్యుత్‌ ఉండదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్..

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 18 , 2026 | 07:28 AM