Share News

హైదరాబాద్‏లో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..

ABN , Publish Date - Oct 31 , 2026 | 07:10 AM

విద్యుత్‌ ఫీడర్‌లలో సాంకేతిక మరమ్మతుల కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో కోత విధిస్తున్నట్లు ఏఎస్ రావునగర్‌ ఏఈ వేముల గంగాభవాని తెలిపారు.

హైదరాబాద్‏లో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..
Hyderabad Power Cut

హైదరాబాద్: విద్యుత్‌ ఫీడర్‌లలో సాంకేతిక మరమ్మతుల కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో కోత విధిస్తున్నట్లు ఏఎ్‌సరావునగర్‌ ఏఈ వేముల గంగాభవాని తెలిపారు. గోకుల్‌నగర్‌ ఫీడర్‌లో పరిధిలోని గోకుల్‌నగర్‌, పార్వతీనగర్‌, హెచ్‌ఐజి-ఏ, ఆఫీసర్స్‌ కాలనీ జి-బ్లాక్‌, శారదా ఆస్పత్రి, వాటర్‌వర్క్స్‌ ఏరియా, అంకురా హాస్పిటల్‌ పరిసర ప్రాంతాలలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్‌ సరఫరాలో కోత విధిస్తున్నట్లు ఆమె తెలిపారు.


city1.2.jpgమౌలాలి సబ్‌స్టేషన్‌ పరిధిలో..

మౌలాలి సబ్‌స్టేషన్‌ పరిధిలోని జవహర్‌నగర్‌ ఫీడర్‌లో సాంకేతిక మరమ్మతుల కారణంగా శనివారం జవహర్‌నగర్‌, రాఘవేంద్రనగర్‌, కస్తుర్భానగర్‌, వసంత్‌విహార్‌ కాలనీ, కృష్ణవేణినగర్‌, ఏపీఐఐసీ కాలనీ తదితర ప్రాంతాలలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో కోత విధించనున్నట్లు మౌలాలి ఏఈ ఏ.వెంకటరెడ్డి తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి తమతో సహకరించాలని ఆయన కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 07:10 AM