సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ రూ.1,10,250
ABN , Publish Date - Oct 31 , 2026 | 06:04 AM
ఇటీవలే లాభాల వాటాను (దసరా బోనస్) అందుకున్న సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది.
హైదరాబాద్/ కొత్తగూడెం టౌన్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఇటీవలే లాభాల వాటాను (దసరా బోనస్) అందుకున్న సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. నవంబరు5న దీపావళి బోన్‌సను (పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ బోనస్) చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో సింగరేణి ఉద్యోగులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ దీపావళి బోన్‌సను చెల్లించాల్సిందిగా సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు.
ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.1,10,250 చొప్పున అందనుంది. లాభాల వాటా కింద ఈ నెలలో రూ.600 కోట్లు చెల్లించగా.. తాజాగా రూ.419 కోట్ల దీపావళి బోనస్ చెల్లించబోతున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. కాగా, నవంబరు 5న దీపావళి బోన్‌సను కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్థప్రకాష్ జ్యోతి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మియాపూర్ భూములు కొల్లగొట్టేందుకు..కేసీఆర్‌కు ముడుపులు
మహిళల హాస్టల్ మాటున అండాల సేకరణ?
ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News