Share News

హైదరాబాద్‌ పట్టభద్రుల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొల్లూరు ఆకాశ్‌

ABN , Publish Date - Oct 31 , 2026 | 06:19 AM

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌ నగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిగా సీనియర్‌ జర్నలిస్ట్‌ కొల్లూరు ఆకాశ్‌ను ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు.

హైదరాబాద్‌ పట్టభద్రుల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొల్లూరు ఆకాశ్‌
Kolluru Akash

హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌ నగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిగా సీనియర్‌ జర్నలిస్ట్‌ కొల్లూరు ఆకాశ్‌ను ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానం నుంచి నలమాస శ్రీకాంత్‌ గౌడ్‌ బరిలో ఉంటారని, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు బీసీ అభ్యర్థులనే ఖరారు చేసినట్లు శుక్రవారం ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.


అదే సమయంలో హైదరాబాద్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ పరిశీలకుడు, సమన్వయకర్తగా పార్టీ నాయకుడు చిట్నేని రఘును నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు స్ట్రాటజీ, వార్‌రూమ్‌ ఇన్‌చార్జిగా న్యాయవాది రామ్‌ కల్యాణ్‌ను నియమించామని, రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్‌చార్జులను నిర్ణయించినట్లు కవిత వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ విస్తరణ

మాక్‌ పార్లమెంటు పేరిట ప్రజాస్వామ్య అవహేళన

హైదరాబాద్‌కు వచ్చేముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 06:19 AM