Share News

ఆలయాలకు సరఫరా చేసే నెయ్యి రేటును రూ.690కి పెంచండి

ABN , Publish Date - Oct 31 , 2026 | 06:07 AM

నెయ్యిని కిలోకు రూ.609చొప్పున సరఫరా చేస్తే గిట్టుబాటు కాదని, కనీసం రూ.690కి పెంచాలని విజయ డెయిరీ యాజమాన్యం రాష్ట్ర దేవాదాయ శాఖను కోరింది.

ఆలయాలకు సరఫరా చేసే నెయ్యి రేటును రూ.690కి పెంచండి
Vijaya Dairy

  • రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన విజయ డెయిరీ

హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): నెయ్యిని కిలోకు రూ.609చొప్పున సరఫరా చేస్తే గిట్టుబాటు కాదని, కనీసం రూ.690కి పెంచాలని విజయ డెయిరీ యాజమాన్యం రాష్ట్ర దేవాదాయ శాఖను కోరింది. ‘‘నెయ్యి తయారీకి అవసరమైన వెన్న రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. ఉత్తరాది నుంచి మేలిమి రకం వెన్న దిగుమతి చేసుకుంటున్నాం. పెరిగిన ఇంధన ధరలు, ఇతర కారణాలతో రవాణా ఖర్చులూ పెరుగుతున్నాయి.


ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇస్తున్న ధరకు నెయ్యి సరఫరా చేయడం ఆర్థికంగా ఇబ్బందికరంగా మారింది’’ అని తెలిపింది. ఈ మేరకు కొద్దిరోజుల క్రితమే ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ఫైల్‌ సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు చేరింది. దేవాదాయ శాఖ ప్రస్తుతం సీఎం పర్యవేక్షణలోనే ఉంది. కాగా, 2024లో తిరుపతిలో కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో లడ్డూ లు, ఇతర ప్రసాదాలు, పూజల కోసం ప్రైవేటు సంస్థల నుంచి కాకుండా విజయ డెయిరీ నుంచే నెయ్యిని కొనుగోలు చేయాలని నిర్ణయించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

మియాపూర్‌ భూములు కొల్లగొట్టేందుకు..కేసీఆర్‌కు ముడుపులు

మహిళల హాస్టల్‌ మాటున అండాల సేకరణ?

ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 06:07 AM