2,545 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Oct 31 , 2026 | 06:10 AM
కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి 2,545 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు చేయడానికి తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) ఆమోదం తెలిపింది.
యూనిట్ ధర రూ.2.45లు
హైదరాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి 2,545 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు చేయడానికి తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) ఆమోదం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్టీపీసీ నుంచి 1,045 మెగావాట్లు, ఎన్‌హెచ్‌పీసీ నుంచి 500 మెగావాట్లు, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకి) నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు అంగీకారం తెలిపింది.
ఎన్‌టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీల నుంచి యూనిట్ రూ.2.45లకు, సెకీ నుంచి 700 మెగావాట్లను యూనిట్ రూ.2.37లకు, మరో 300 మెగావాట్లను రూ.2.38లకు కొనుగోలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో జాప్యం, జీఎస్టీ పెంపు కారణంగా టారి్‌ఫల సవరణ, అంతర్రాష్ట్ర విద్యుత్ ట్రాన్స్‌మిషన్ చార్జీలు, మధ్యవర్తి సంస్థలకు చెల్లించే ట్రేడింగ్ మార్జిన్ వంటి అంశాలపై నియంత్రణ మండలి పలు కీలక అంశాలను వెల్లడించింది. 2545 మెగావాట్లలో ఇప్పటికే 1745 మెగావాట్ల ప్లాంట్లు సిద్ధం కాగా.. మిగిలిన 800 మెగావాట్ల ప్లాంట్లు నిర్మాణ దశలో ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
మియాపూర్ భూములు కొల్లగొట్టేందుకు..కేసీఆర్‌కు ముడుపులు
మహిళల హాస్టల్ మాటున అండాల సేకరణ?
ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News