Share News

కాసుల కోసం కక్కుర్తి.. నేరస్థులతో దోస్తీ

ABN , Publish Date - Nov 25 , 2026 | 10:52 AM

కంచె చేను మేస్తే అన్న చందంగా ఉన్నది కొంతమంది క్షేత్రస్థాయి పోలీసుల తీరు. పలు పోలీస్‌ స్టేషన్‌లలో ఎస్‌హెచ్‌వో మొదలుకొని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అవినీతిమయంగా మారిపోయారు.

కాసుల కోసం కక్కుర్తి.. నేరస్థులతో దోస్తీ
Hyderabad Police

  • అక్రమార్కులు, అవినీతి పోలీసులపై విచారణకు సీపీ ఆదేశం

  • త్వరలోనే సీపీకి జాబితా

హైదరాబాద్‌ సిటీ: కంచె చేను మేస్తే అన్న చందంగా ఉన్నది కొంతమంది క్షేత్రస్థాయి పోలీసుల తీరు. పలు పోలీస్‌ స్టేషన్‌లలో ఎస్‌హెచ్‌వో మొదలుకొని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అవినీతిమయంగా మారిపోయారు. ఎవరి స్థాయిలో వారు కాసుల కక్కుర్తిలో పడి నేరస్థులతో దోస్తీ కడుతూ బాధితులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. కొన్ని కేసుల్లో పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయానికి బాధితులు వచ్చేలా ప్రవర్తిస్తున్నారనడంలో అతిశయోక్తిలేదు.


city5.jpgకనిపించని మార్యాద

స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు ఆదేశించినా ఎక్కడా అమలు కావడం లేదు. ఇటీవల మల్కాజిగిరి, హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయంలో కొందరు ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్‌లను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేయగా.. మరికొంతమంది ఏసీబీకి చిక్కి కటకటాలపాలయ్యారు.


అంతర్గత విచారణ

కొందరు పోలీసులు నేరస్థులతో దోస్తీకడుతున్నారు. తెరవెనుక వారితో మంత్రాంగం నడుపుతూ బాధితులకు చుక్కలు చూపిస్తున్నారు. కాసులు కురిపించే కేసులపై దృష్ట సారించి సాధారణ ప్రజల కేసులను తుంగలో తొక్కుతున్నారు. దొంగలు, దోపిడీలకు మాదక ద్రవ్యాల సరఫరాకు సహకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని జోన్‌లలో అక్రమార్కులు, అవినీతి పోలీసులపై నగర పోలీస్‌ కమిషనర్‌ అంతర్గత విచారణకు అదేశించినట్లు తెలిసింది. వారి లెక్క లేత్చేందుకు ఎస్‌బీ అధికారులు రంగంలోకి దిగినట్లు సమాచారం. త్వరలోనే అవినీతి అధికారులు జాబితాను సీపీకి అందజేయనున్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారానికి పెరిగిన డిమాండ్.. ధరలు జంప్

దిగి వచ్చిన బియ్యం ధరలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 10:52 AM