తిరుపతిలో రేషన్ బియ్యం దందా గుట్టురట్టు.. 16.8 టన్నుల బియ్యం, 6 వాహనాల సీజ్
ABN , Publish Date - Nov 25 , 2026 | 09:51 AM
తిరుపతి జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం దందా గుట్టును పోలీసులు రట్టుచేశారు. అక్రమంగా తరలిస్తున్న 16 టన్నుల బియ్యాన్ని పట్టుకుని కేసు నమోదు చేశారు.
తిరుపతి, నవంబరు 25: జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం దందాను పోలీసులు బట్టబయాలు చేశారు. అక్రమంగా తరలిస్తున్న 16 టన్నుల బియ్యాన్ని, 6 వాహనాలను సీజ్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి జిల్లాలోని నగరిలో రేషన్ బియ్యం దందా జోరుగా కొనసాగుతోంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా కీళపట్టు సమీపంలోని రేషన్ బియ్యం గోడౌన్‌లపై దాడులు చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉన్న 16 టన్నుల 856 కిలోల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానితోపాటు బియ్యం అక్రమ రవాణాకు వినియోగించే 6 వాహనాలను సీజ్ చేశారు.
కాగా పోలీసుల దర్యాప్తులో ఈ గోడౌన్‌లు అమృతరాజు అలియాస్ టి.ఆర్.ఎస్ అలియాస్ నాటార్‌కు చెందినవిగా గుర్తించారు. ఈ క్రమంలో క్రైమ్ నంబర్ 109/2026 కింద అత్యవసర వస్తువుల చట్టం సెక్షన్ 7(1) ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి