Share News

ఏడాదిలో వెయ్యి ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు!

ABN , Publish Date - Nov 25 , 2026 | 10:24 AM

రాష్ట్ర వ్యాప్తంగా ఈవీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ నేపథ్యంలో ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు టీజీ రెడ్కో ఎండీ జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు.

ఏడాదిలో వెయ్యి ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు!
EV Charging Stations

  • చార్జింగ్‌ స్టేషన్ల నిర్వహణపై స్పెషల్‌ డ్రైవ్‌

  • ప్రైవేట్‌ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

  • టీజీ రెడ్కో ఎండీ జితేష్‌ వి పాటిల్‌

హైదరాబాద్‌ సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా ఈవీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ నేపథ్యంలో ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు టీజీ రెడ్కో ఎండీ జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ ఏడాదిలో వెయ్యి ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తునట్లు తెలిపారు. గ్రేటర్‌లో టీజీ రెడ్కో ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన 194 ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల నిర్వహణపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నామన్నారు. దొంగతనాలు జరగకుండా ప్రతి ఈవీ స్టేషన్‌ వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు.


city4.2.jpgఈ డ్రైవ్‌లో భాగంగా టీజీఎన్పీడీసీఎల్‌ పరిధిలో 116, టీజీఎస్పీడీసీఎల్‌లో 364 కొత్తగా ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి గ్రేటర్‌లో అన్ని ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టీజీ రెడ్కో ప్రైవేట్‌గా చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్న సంస్థలనూ ప్రోత్సహిస్తుందన్నారు. తమ సొంత స్థలాల్లో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసుకునేందుకు అసక్తిగల వారు టీజీ రెడ్కో వెబ్‌సైట్‌లో నేరుగా డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేసి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈవీ చార్జింగ్‌ స్టేషన్లలో యూనిట్‌కు రూ.13 (జీఎస్టీ అదనం) చార్జి ఉంటుందని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారానికి పెరిగిన డిమాండ్.. ధరలు జంప్

దిగి వచ్చిన బియ్యం ధరలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 10:24 AM