Share News

గజం ధర ఎంత పలికేనో!

ABN , Publish Date - Nov 25 , 2026 | 09:24 AM

సంపన్న ప్రాంతంగా పేరొందిన బంజారాహిల్స్‌ హుడా హైట్స్‌లోని ప్లాట్లను బుధవారం ఆన్‌లైన్‌లో వేలం వేయనున్నారు.

గజం ధర ఎంత పలికేనో!
GHMC

  • బంజారాహిల్స్‌లోని 8 ప్లాట్లకు నేడు ఈ-వేలం

హైదరాబాద్‌ సిటీ: సంపన్న ప్రాంతంగా పేరొందిన బంజారాహిల్స్‌ హుడా హైట్స్‌లోని ప్లాట్లను బుధవారం ఆన్‌లైన్‌లో వేలం వేయనున్నారు. ఎమ్మెల్యే కాలనీని ఆనుకొని ఉన్న హుడా హైట్స్‌ లే అవుట్‌ను 20 ఏళ్ల క్రితం అభివృద్ధి చేశారు. అందులోని మిగిలిన స్థలాలను విక్రయించడానికి గత నెలలో హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 10,159 చ.గజాల విస్తీర్ణం కలిగిన 8 ప్లాట్లను అమ్మకానికి పెట్టింది. ఒక్కో ప్లాట్‌ విస్తీర్ణం 900 చ.గజాల నుంచి 1400 చ.గజాల వరకు ఉంది. ఈ ప్లాట్లకు చ.గజానికి కనీస ధరను రూ.2లక్షలుగా హెచ్‌ఎండీఏ అధికారులు నిర్ణయించారు.


city3.2.jpgమల్టీపర్పస్‌ జోన్‌లో ఉన్న ఈ ప్లాట్లకు 40 అడుగుల విస్తీర్ణం కలిగిన రోడ్డు సౌకర్యం ఉన్నది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ మధ్యలో గల హుడా హైట్స్‌లోని ఈ స్థలాలకు ధర ఏ మేరకు పలుకుతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే చ.గజం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల మధ్య పలుకుతుందని, ఈ ప్లాట్ల అమ్మకం ద్వారా రూ.350 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని హెచ్‌ఎండీఏ అధికారులు అంచనా వేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారానికి పెరిగిన డిమాండ్.. ధరలు జంప్

దిగి వచ్చిన బియ్యం ధరలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 09:27 AM