Share News

ఏపీలో భారీ పెట్టుబడులు.. 54, 210 మందికి ఉపాధి అవకాశం!

ABN , Publish Date - Nov 25 , 2026 | 08:21 AM

అనకాపల్లిలో 720 మెగావాట్ల డాటా సెంటర్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిన్న (మంగళవారం) సచివాలయంలో నిర్వహించిన సమావేశంతో సీఎం చంద్రబాబు సంస్థ ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు.

ఏపీలో భారీ పెట్టుబడులు.. 54, 210 మందికి ఉపాధి అవకాశం!
investments in ap

అమరావతి, నవంబరు 25: అనకాపల్లిలో 720 మెగావాట్ల డాటా సెంటర్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికోసం జిల్లాలోని తూలిపాళ్ల వద్ద 200 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంస్థ ఏర్పాటు కోసం బాలేవాడి టెక్‌పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 47,009 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.


అలాగే.. విశాఖపట్నంలోని కాపులుప్పాడ వద్ద ఐటీ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ. 2,187 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకానున్న ఈ సంస్థ కోసం ప్రభుత్వం 30 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ రెండు ప్రాజెక్ట్‌ల ద్వారా సుమారు 29,600 మందికి ఉపాధి అవకాశం కలుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.

వీటితో పాటు.. కియా ఇండియా, సెయింట్ గోబైన్, ఏటీసీ టైర్స్, జెంటారి, అదాని ఎంటర్‌ప్రైసెస్ వంటి సంస్థలు ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయి. మొత్తంగా 17 సంస్థలు.. రూ.88,392.60 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. దీంతో సుమారు 54, 210 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని అధికారులు వెల్లడించారు. ఈ సంస్థలు పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ రంగం, పర్యాటక రంగం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆరనీకుమా ఈ దీపం..

కరీంనగర్‌ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 09:08 AM