జేఎన్‌టీయూ పూర్వ విద్యార్థులకు శుభవార్త
ABN , Publish Date - Nov 25 , 2026 | 08:34 AM
జేఎన్‌టీయూ పూర్వ విద్యార్థుల ఇక్కట్లకు యూనివర్సిటీ పరీక్షల విభాగం తాజాగా చెక్ చెప్పింది.
డూప్లికేట్ ఓడీ కోసం పోలీస్ సర్టిఫికెట్ అక్కర్లేదిక.!
పరీక్షల విభాగం ప్రతిపాదనకు స్టాండింగ్ కమిటీ ఆమోదం
హైదరాబాద్ సిటీ: జేఎన్‌టీయూ పూర్వ విద్యార్థుల ఇక్కట్లకు యూనివర్సిటీ పరీక్షల విభాగం తాజాగా చెక్ చెప్పింది. వర్సిటీ అనుబంధ, అఫిలియేటెడ్ కళాశాలల్లో చదివిన విద్యార్థులు తమ ఒరిజినల్ డిగ్రీలు పోగొట్టుకున్నట్లయితే, డూప్లికేట్ పొందడానికి పోలీసుల నుంచి నాట్ ట్రేస్డ్ సర్టిఫికెట్‌ను తీసుకొని సమర్పించాల్సి ఉంది. అయితే, వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉంటున్న విద్యార్థులు ఆ సర్టిఫికెట్‌ను పొందడానికి అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
పూర్వ విద్యార్థుల అభ్యర్థన మేరకు వర్సిటీ ఉన్నతాధికారులు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై డూప్లికేట్ లేదా ట్రిప్లికేట్ ఓడీ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు.. నాట్‌ట్రేస్డ్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదని పరీక్షల విభాగం అధికారులు ప్రతిపాదించారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జయలక్ష్మి జారీ చేసిన ఉత్తర్వుకు సోమవారం సమావేశమైన అకాడమిక్ సెనేట్ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారానికి పెరిగిన డిమాండ్.. ధరలు జంప్
Read Latest AP News And Telangana News And International News And Telugu News