Share News

కంఠేశ్వర ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం: కవిత

ABN , Publish Date - Nov 25 , 2026 | 10:32 AM

నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత పర్యటించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కంఠేశ్వర్‌లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి స్వామిని దర్శించుకుని.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

కంఠేశ్వర ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం: కవిత
Kalvakuntla Kavitha

నిజామాబాద్, నవంబర్ 25: జిల్లాలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత పర్యటించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కంఠేశ్వర్‌లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి స్వామిని దర్శించుకుని.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. భక్తులకు నీలకంఠేశ్వర స్వామి కొంగు బంగారమని తెలిపారు. కార్తీక పౌర్ణమి రోజు స్వామి వారి దర్శనం.. మరుసటి రోజు శ్రీనీలకంఠేశ్వర స్వామి వారికి అభిషేకం చేయడం తమ కుటుంబ ఆనవాయితీ అని చెప్పుకొచ్చారు.


నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో మరికొన్ని అభివృద్ధి పనులు చేయాల్సి ఉందని అర్చకులు తెలిపారని కవిత అన్నారు. నిజామాబాద్ బిడ్డగా ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచడాన్ని తమ బాధ్యతగా తీసుకున్న యువతకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రజలకు కవిత కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి...

ఎన్టీఆర్ జిల్లా కనుమూరు ఫారెస్ట్‌లో పెద్దపులి మకాం.. ఐదోరోజూ గాలింపు

బాసరలో అగ్నిప్రమాదం.. పెళ్లి సామాగ్రి సహా నగదు, బంగారం దగ్ధం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 10:39 AM