Share News

చికెన్‌ ధర తగ్గింది... గుడ్డు రేటు పెరిగింది

ABN , Publish Date - Nov 25 , 2026 | 07:23 AM

కార్తీక మాసంలో కోడి మాంసానికి డిమాండ్‌ తగ్గి... గుడ్డుకు మాత్రం పెరిగింది. చలి వాతావరణంతో గుడ్ల దిగుబడి తగ్గడమే మార్కెట్‌లో ధర పెరగడానికి కారణమని పౌల్ర్టీ రైతులంటున్నారు.

చికెన్‌ ధర తగ్గింది... గుడ్డు రేటు పెరిగింది
Chicken, Egg Price

తిరుపతి: కార్తీక మాసంలో కోడి మాంసానికి డిమాండ్‌ తగ్గి... గుడ్డుకు మాత్రం పెరిగింది. చలి వాతావరణంతో గుడ్ల దిగుబడి తగ్గడమే మార్కెట్‌లో ధర పెరగడానికి కారణమని పౌల్ర్టీ రైతులంటున్నారు. అంతేకాకుండా ఇతర రాష్ర్టాల్లో డిమాండ్‌ నెలకొనడంతో ఇక్కడ ఉత్పత్తి అయ్యే గుడ్లను ఎక్కువగా బిహార్‌, మహారాష్ట్ర, అస్సాం, కోల్‌కత్తా, పశ్చిమ బెంగాల్‌ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. జిల్లాలో దాదాపు రోజుకు 30లక్షల నుంచి 35 లక్షల గుడ్లు ఉత్పత్తి జరుగుతుండగా స్థానిక అవసరాలు పోను ఉత్తరాంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు 20 లక్షల గుడ్లు ఎగుమతి అవుతున్నాయి.


egg.jpgఎల్‌నినో ప్రభావంతో కోళ్ల దాణా ధరలు అనూహ్యంగా పెరగడం, నిర్వహణ ఖర్చు అధికం కావడంతో గుడ్ల ధరపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వ్యాపారులు చెపుతున్నారు. నిన్న మొన్నటి వరకు గుడ్డు ధర రూ.5.60 నుంచి రూ5.80 వరకు ఉండగా ప్రస్తుతం రూ.7.30కు చేరింది. ఇక వారం రోజుల క్రితం వరకు చికెన్‌ కిలో రూ.270నుంచి 280 వరకు పలికింది. ప్రస్తుతం రూ.180 వరకు విక్రయిస్తున్నారు. కార్తీక మాసం ముగిసే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం వుందని వ్యాపారులు అంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

చెదురుమదురుగా వర్షాలు

సీనరేజ్‌ కాంట్రాక్టుకు త్వరలో టెండర్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 07:24 AM