సర్పంచ్ పదవికి ‘టెండర్’!
ABN , Publish Date - Nov 25 , 2026 | 04:55 AM
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం నక్కలపల్లి సర్పంచ్ పదవికి ఏకగ్రీవ ఎన్నిక సాధారణానికి భిన్నంగా కాస్త వినూత్నంగా జరిగింది. కాంట్రాక్టు పనుల తరహాలో ‘టెండర్’ ప్రక్రియ చేపట్టి..
25.60 లక్షలకు కోట్ చేసి కైవసం
బెళుగుప్ప, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం నక్కలపల్లి సర్పంచ్ పదవికి ఏకగ్రీవ ఎన్నిక సాధారణానికి భిన్నంగా కాస్త వినూత్నంగా జరిగింది. కాంట్రాక్టు పనుల తరహాలో ‘టెండర్’ ప్రక్రియ చేపట్టి.. ఎవరు ఎక్కువ మొత్తం కోట్ చేసిన వారికి పదవిని కట్టబెట్టారు. గ్రామంలోని ఆలయాల అభివృద్ధికి ఎవరు ఎక్కువ నిధులు రాస్తే.. వారికి పదవి ఇచ్చేలా గ్రామస్థులు తీర్మానం చేశారు. దీనికి టెండర్ల తరహాలో రహస్య చీటీల పద్ధతిని ఎంచుకున్నారు.
ఆశావహులందరూ తమ తమ మొత్తాలను చీటీలలో కోట్ చేశారు. వాటిని ప్రజలందరి సమక్షంలో తెరిచి చూపించారు. ఈ క్రమంలో అత్యధికంగా రూ.25.60 లక్షలు రాసిన మచ్చుమర్రి అఖిల.. సర్పంచ్‌గా అవకాశాన్ని దక్కించుకున్నారు. నక్కలపల్లి సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. మొత్తం 8 మంది ఆశావహులు పోటీలో పాల్గొన్నారు. ఒప్పందం మేరకు అఖిల మాత్రమే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి