Share News

ఆర్‌.బైరిపురంలో ఏకగ్రీవాల సంప్రదాయం

ABN , Publish Date - Nov 25 , 2026 | 04:49 AM

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ఆర్‌.బైరిపురం గ్రామ పంచాయతీలో 1980 నుంచి సర్పంచ్‌, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు.

ఆర్‌.బైరిపురంలో ఏకగ్రీవాల సంప్రదాయం

  • 1980 నుంచి ఎన్నికలే లేవు

కవిటి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ఆర్‌.బైరిపురం గ్రామ పంచాయతీలో 1980 నుంచి సర్పంచ్‌, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. 1980లో గ్రామపంచాయతీగా ఏర్పడిన తరువాత పుల్లట వాసుదేవనాయుడు తొలి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన కుమారులు, కోడళ్లు సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తున్నారు.

ఈ పంచాయతీలో సుమారు 1500 జనాభా ఉండగా, 1100 మంది ఓటర్లున్నారు. గ్రామ కట్టుబాట్లు, పరస్పర అంగీకారంతో ఇప్పటివరకు ఏకగ్రీవ ఎన్నికల సంప్రదాయాన్ని కొనసాగించారు. తొలిసారి ‘పుల్లట’ వంశీయులు పోటీకి దూరం జరిగారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్‌ పదవికి 8 మంది పోటీ పడ్డారు. గ్రామస్థులు కడియాల వెంకటరావును సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ‘ఏకగ్రీవం’ సంప్రదాయాన్ని నిలబెట్టుకున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

Updated Date - Nov 25 , 2026 | 04:51 AM