Share News

సీనరేజ్‌ కాంట్రాక్టుకు త్వరలో టెండర్లు

ABN , Publish Date - Nov 25 , 2026 | 06:08 AM

సీనరేజీ కలెక్షన్‌ కాంట్రాక్టు(ఎస్‌సీసీ) ముగిసిన మూడు జిల్లాలు... విజయనగరం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సీనరేజ్‌ కాంట్రాక్టు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

సీనరేజ్‌ కాంట్రాక్టుకు త్వరలో టెండర్లు

  • విజయనగరం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగిసిన పాత ఏజెన్సీల కాలపరిమితి

  • ‘కోడ్‌’ రీత్యా ఎస్‌ఈసీని అనుమతి కోరిన గనుల శాఖ

అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): సీనరేజీ కలెక్షన్‌ కాంట్రాక్టు(ఎస్‌సీసీ) ముగిసిన మూడు జిల్లాలు... విజయనగరం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సీనరేజ్‌ కాంట్రాక్టు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. టెండర్లు పిలిచి ఎస్‌సీసీ ఏజెన్సీలను ఎంపిక చేయడానికి ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. దీంతో టెండర్ల నిర్వహణకు అనుమతి కోరుతూ గనుల శాక రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. అక్కడి నుంచి అనుమతి రాగానే టెండర్ల నిర్వహణకు గనుల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే ప్రభుత్వానికి ప్రతి నెలా సగటున ఈ మూడు జిల్లాల నుంచి రూ.37.3 కోట్ల చొప్పున ఫీజు రూపంలో వస్తుందని గనుల శాఖ అంచనా వేసింది.

కాగా, శ్రీకాకుళం జిల్లాలో సీనరేజీ కాంట్రాక్ట్‌ చేసిన ఏజెన్సీ నుంచి రూ.85.80 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని గనుల శాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదించింది. మరోవైపు ఇటీవల తూర్పుగోదావరి, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలకు సీనరేజీ క లెక్షన్‌ ఏజెన్సీల ఎంపిక కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం బిడ్లు దాఖలు కాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి రిజర్వ్‌ ప్రైస్‌ సవరణపై గనుల శాఖ కసరత్తు చేస్తోంది. ఈ జిల్లాల్లో ఎస్‌సీసీ టె ండర్లు పూర్తయి, ఏజెన్సీలను ఎంపిక చేస్తే నెలకు సగటున రూ.75.6 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.

ఈ వార్తలనూ చదవండి:

ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

Updated Date - Nov 25 , 2026 | 06:17 AM