Share News

బాసరలో అగ్నిప్రమాదం.. పెళ్లి సామాగ్రి సహా నగదు, బంగారం దగ్ధం

ABN , Publish Date - Nov 25 , 2026 | 10:10 AM

నిర్మల్ జిల్లాలోని బాసరలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కుటుంబసభ్యులు భయంతో బయటకు పరుగులుతీశారు. బాసరలోని రవీంద్రపూర్ కాలనీలో ఈ ప్రమాదం జరిగింది.

బాసరలో అగ్నిప్రమాదం.. పెళ్లి సామాగ్రి సహా నగదు, బంగారం దగ్ధం
Nirmal District

నిర్మల్, నవంబర్ 25: జిల్లాలోని బాసరలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈరోజు (బుధవారం) ఉదయం ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కుటుంబసభ్యులు భయంతో బయటకు పరుగులుతీశారు. బాసరలోని రవీంద్రపూర్ కాలనీలో ఈ ప్రమాదం జరిగింది. కాలనీలో ఓ ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగింది. ఇంట్లో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.


అయితే ఈ ప్రమాదంలో దాదాపు రూ.10 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం, వెండి, విలువైన పత్రాలు, ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. కుమార్తె పెళ్లి కోసం తెచ్చిన ఫర్నిచర్, బట్టలు కాలి బూడిదైనట్లు బాధితులు వెల్లడించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపరిపీల్చుకున్నారు. ఫైర్‌ సిబ్బంది ఎంతో శ్రమించి మంటలను అదుపుచేశారు.


ఇవి కూడా చదవండి...

ఏపీలో భారీ పెట్టుబడులు.. 54, 210 మందికి ఉపాధి అవకాశం!

ఎన్టీఆర్ జిల్లా కనుమూరు ఫారెస్ట్‌లో పెద్దపులి మకాం.. ఐదోరోజూ గాలింపు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 10:15 AM