పసిడి, వెండి ధరల్లో ఊహించని ట్విస్ట్
ABN , Publish Date - Nov 25 , 2026 | 10:08 AM
గత రెండు రోజులుగా భారత్‌లో వరుసగా పెరిగిన ధరలు నేడు అనూహ్యంగా పడిపోయాయి.
ఇంటర్నెట్ డెస్క్: గత రెండు రోజులుగా భారత్‌లో వరుసగా పెరిగిన ధరలు నేడు అనూహ్యంగా పడిపోయాయి. దేశంలో మేలిమి బంగారం ధరలో ఏకంగా రూ.3,220 మేర కోత పడింది (Gold, Silver Rates on 25, Nov, 2026). అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనాలు బలపడటంతో గోల్డ్ రేట్స్ మళ్లీ పడిపోతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,24,580కు పడిపోయింది. నిన్నటితో పోలిస్తే ధరలో రూ.3,220 మేర కోత పడింది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ పసిడి ధరలో కూడా రూ.2,950 మేర కోత పడింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.1,14,200గా ఉంది. నేడు నగరంలో వెండి ధరలు కూడా భారీ స్థాయిలో పతనమయ్యాయి. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధర రూ.10 వేల మేర తగ్గి రూ.1.65 లక్షలకు చేరుకుంది.
తెలంగాణలో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
వరంగల్ | ₹1,24,580 | ₹1,14,200 | ₹93,440 |
నిజామాబాద్ | ₹1,24,580 | ₹1,14,200 | ₹93,440 |
ఖమ్మం | ₹1,24,580 | ₹1,14,200 | ₹93,440 |
ఏపీలో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
విజయవాడ | ₹1,24,580 | ₹1,14,200 | ₹93,440 |
విశాఖపట్నం | ₹1,24,580 | ₹1,14,200 | ₹93,440 |
అమరావతి | ₹1,24,580 | ₹1,14,200 | ₹93,440 |
కాకినాడ | ₹1,24,580 | ₹1,14,200 | ₹93,440 |
తిరుపతి | ₹1,24,580 | ₹1,14,200 | ₹93,440 |
భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | ₹1,24,580 | ₹1,14,200 | ₹93,450 |
ముంబై | ₹1,24,580 | ₹1,14,200 | ₹93,440 |
ఢిల్లీ | ₹1,24,730 | ₹1,14,350 | ₹93,590 |
కోల్‌కతా | ₹1,24,580 | ₹1,14,200 | ₹93,440 |
బెంగళూరు | ₹1,24,580 | ₹1,14,200 | ₹93,440 |
కేరళ | ₹1,24,580 | ₹1,14,200 | ₹93,440 |
పుణె | ₹1,24,580 | ₹1,14,200 | ₹93,440 |
వడోదరా | ₹1,24,630 | ₹1,14,250 | ₹93,490 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి:
1385 పాయింట్లకు ఎగబాకిన సెన్సెక్స్, 400 పాయింట్లకు నిఫ్టీ
విద్యుత్ ట్రక్కుల మార్కెట్లోకి ఒలెక్ట్రా