విద్యుత్ ట్రక్కుల మార్కెట్లోకి ఒలెక్ట్రా
ABN , Publish Date - Nov 25 , 2026 | 05:13 AM
హైదరాబాద్‌కు చెందిన విద్యుత్ బస్సుల తయారీ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్.. ఎలక్ట్రిక్ ట్రక్కుల మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. 2027-28 ఆర్థిక సంవత్సరం...
ఆరు మోడళ్లను తీసుకురానున్న కంపెనీ
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన విద్యుత్ బస్సుల తయారీ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్.. ఎలక్ట్రిక్ ట్రక్కుల మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. 2027-28 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచి వరుసగా ఆరు మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయాలన్న ప్రణాళికతో ఉంది. వాణిజ్య వాహనాల విభాగంలో తన ఉనికిని విస్తరించుకోవడంలో భాగంగా మీడియం, హెవీ కమర్షియల్ వెహికిల్ విభాగాలపై కంపెనీ దృష్టి సారిస్తోంది. విభిన్న ప్రదేశాల్లో పరీక్షించేందుకు గాను తమ కంపెనీ 10-12 ప్రొటోటైప్‌లపై కసరత్తు చేస్తోందని, ఏప్రిల్-జూన్ నుంచి ప్రతి త్రైమాసికంలో ఒక ట్రక్కును విడుదల చేయాలనుకుంటున్నట్టు ఒలెక్ర్టా గ్రీన్‌టెక్ ఎండీ మహేష్ బాబు తెలిపారు. తొలుత 38-55 టన్నుల సామర్థ్యం గల ట్రక్కులను తీసుకు రానున్నట్లు చెప్పారు. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద ప్రభుత్వ సబ్సిడీకి అర్హత ఉండేలా తమ కంపెనీయే ఎలక్ర్టిక్ ట్రక్కులను అభివృద్ధి చేసి తయారు చేస్తుందని మహేష్ తెలిపారు. అలాగే నవతరం బస్సులు, ట్రక్కు ప్లాట్‌ఫామ్‌ల కోసం ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ దాదాపు రూ.450 కోట్ల పెట్టుబడి పెడుతోందని మహేష్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
ప్రియా సరోజ్‌కు రింకూ సింగ్ బర్త్‌డే విషెస్..
వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం.. 28 సిక్సర్ల వీడియో వైరల్!