వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం.. 28 సిక్సర్ల వీడియో వైరల్!
ABN , Publish Date - Nov 24 , 2026 | 09:17 PM
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (204; 53 బంతుల్లో) విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-ఎ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (204; 53 బంతుల్లో) విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-ఎ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వైభవ్ డబుల్ సెంచరీతో 250 పరుగుల లక్ష్యాన్ని 14.2 ఓవర్లలోనే భారత్-ఎ ఛేదించింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ ఏకంగా 28 సిక్స్‌లు బాదేశాడు. అలానే లిస్ట్ ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ, 150, డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా వైభవ్ చరిత్ర సృష్టించాడు. 16 బంతుల్లో 50, 28 బంతుల్లో 100, 40 బంతుల్లో 150, 52 బంతుల్లో 200 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
ప్రియా సరోజ్‌కు రింకూ సింగ్ బర్త్‌డే విషెస్..
ఆకాశ్‌దీప్‌పై గిల్ అసహనం.. కెప్టెన్ తీరును తప్పుబట్టిన రహానె!