Share News

కండరాల క్షీణతతో బాధపడే చిన్నారులకు అండగా ఉంటాం: సజ్జనార్

ABN , Publish Date - Oct 31 , 2026 | 02:36 PM

కండరాల క్షీణత, బలహీనత (మస్క్యులర్ డిస్ట్రోఫీ)తో బాధపడే చిన్నారులకు అండగా ఉంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ భరోసా కల్పించారు. మస్క్యులర్ డిస్ట్రోఫీని జెనెటిక్ టెస్టుల ద్వారానే అరికట్టగలమని వ్యాఖ్యానించారు.

కండరాల క్షీణతతో బాధపడే చిన్నారులకు అండగా ఉంటాం: సజ్జనార్
Hyderabad CP Sajjanar

హైదరాబాద్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): కండరాల క్షీణత, బలహీనత (మస్క్యులర్ డిస్ట్రోఫీ)తో బాధపడే చిన్నారులకు అండగా ఉంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) భరోసా కల్పించారు. మస్క్యులర్ డిస్ట్రోఫీని జెనెటిక్ టెస్టుల ద్వారానే అరికట్టగలమని వ్యాఖ్యానించారు. కండరాల క్షీణత వ్యాధిపైన దేశవ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈరోజు (శనివారం) హైదరాబాద్‌లో మీడియాతో సీపీ సజ్జనార్ మాట్లాడారు. చాలా ప్రాంతాల్లో కండరాల క్షీణతతో బాధపడుతున్న చిన్నారులను తాను చూశానని తెలిపారు. బాధిత పిల్లలకు భారత్ ఎండీ ఫౌండేషన్ అండగా నిలుస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా భారత్ ఎండీ ఫౌండేషన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు.


ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత ఉండాలి..

మనలో ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. కండరాల క్షీణత అనేది చాలా తీవ్రమైన వ్యాధి అని చెప్పుకొచ్చారు. ఈ రోజుల్లో చాలామంది పిల్లలను కన్న తర్వాత చెత్తకుప్పల్లో పడేస్తున్నారని.. కానీ పిల్లలకు తీవ్రమైన వ్యాధి ఉన్నప్పటికీ, వాళ్లను అపురూపంగా చూసుకుంటున్నారని... అలాంటి తల్లిదండ్రులు చాలా గ్రేట్ అని అభినందించారు. ఈ వ్యాధి ఉన్న చిన్నారుల సింగిల్ పేరెంట్స్‌ను కూడా తాను చాలామందిని చూశానని అన్నారు. అలాంటి తల్లిదండ్రులకు తగిన గుర్తింపు ఇవ్వాలని సూచించారు.


ఆ చిన్నారులు స్ఫూర్తిదాయకం..

దాదాపుగా 60 మంది చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని సజ్జనార్ తెలిపారు. ఈ 60 మంది పిల్లలు చాలామంది వెరీ టాలెంటెడ్‌గా ఉన్నారని.. వాళ్లు మన అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవాళ్లే కొంతమంది జీవితం భారంగా ఉందని ఫీల్ అవుతారని తెలిపారు. కానీ తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల్లో చిరునవ్వును చూసి తనకు చాలా ఆనందంగా అనిపించిందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైస్పీడ్ రైళ్ల మార్గాల ప‌నులను వేగ‌వంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి

ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 03:21 PM