ఓయూ వద్ద విషాదం.. స్కూటీని ఢీకొన్న టిప్పర్, ఒకరి మృతి
ABN , Publish Date - Sep 30 , 2026 | 07:47 AM
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో ఓ టిప్పర్ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, సెప్టెంబర్ 30: నగరంలోని ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో ప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్ స్కూటీని ఢీకొట్టడంతో స్కూటీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని ఇఫ్లూ వద్ద అటుగా వెళ్తున్న స్కూటీని ఓ టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ మీద ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ అక్కడినుంచి పరారయ్యారు. గమనించిన స్థానికులు ఓయూ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. పరారీలో ఉన్న టిప్పర్ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రికార్డు స్థాయిలో పడిపోతున్న బంగారం ధరలు
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు.. శిలాతోరణం వరకు క్యూలైన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News