Share News

హైదరాబాద్‌లో యువకుడి దారుణ హత్య

ABN , Publish Date - Oct 24 , 2026 | 09:24 PM

హైదరాబాద్ పాతబస్తీ హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. మధుర్ సింగ్‌(21)ను భగత్ సింగ్‌ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు.

హైదరాబాద్‌లో యువకుడి దారుణ హత్య

హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ పాతబస్తీ హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. మధుర్ సింగ్‌(21)ను భగత్ సింగ్‌ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు. పూరానాపూల్‌కు చెందిన భగత్ సింగ్‌తో తన తల్లి మనీషా సింగ్‌‌ సహజీవనం చేస్తున్నట్లు మధుర్ సింగ్‌ ఆరోపించాడు. భగత్ సింగ్‌‌తో ఈ విషయంపై మధుర్ ప్రశ్నించడంతో.. ఈనేపథ్యంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.


ఈ క్రమంలో భగత్ సింగ్‌ కోపంతో మధుర్ సింగ్‌‌ను తీవ్రంగా గాయపరిచాడు. మధుర్‌ను హుటాహుటినా ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మధుర్ సింగ్ మృతిచెందాడు. సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై హుస్సేనీ ఆలం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు భగత్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



ఈ వార్తలు కూడా చదవండి..

పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు తెచ్చాం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ అభివృద్ధిలో ఎస్పీఎఫ్ పాత్ర కీలకం: భట్టి విక్రమార్క

క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యం: మంత్రి పొంగులేటి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 09:52 PM