Share News

నిమ్స్‌లో అవినీతిపై ఉక్కుపాదం.. ఏసీబీ అధికారుల ముమ్మర తనిఖీలు

ABN , Publish Date - Oct 29 , 2026 | 04:32 PM

నిమ్స్‌ ఆస్పత్రిలో ఏసీబీ అధికారులు ఈరోజు (గురువారం) విసృత్తంగా సోదాలు నిర్వహించారు. హాస్పిటల్‌లో పదిమంది ఏసీపీ అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.

నిమ్స్‌లో అవినీతిపై ఉక్కుపాదం.. ఏసీబీ అధికారుల ముమ్మర తనిఖీలు
Hyderabad NIMS Hospital ACB Inspections

హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): నిమ్స్‌ ఆస్పత్రిలో ఏసీబీ అధికారులు ఈరోజు (గురువారం) విసృత్తంగా సోదాలు నిర్వహించారు. హాస్పిటల్‌లో పదిమంది ఏసీపీ అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ మెడికల్ స్టోర్స్ క్యాంటీన్‌తో పాటు మెడికల్ స్టోర్స్ నుంచి పెద్దఎత్తున లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు రావడంతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. క్యాంటీన్‌లో నుంచి రూ.50 లక్షల వరకు లంచాల రూపంలో వెళ్తున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.


ఈ క్రమంలోనే నిమ్స్‌లో భారీ అవినీతి వెలుగు చూసినట్లు సమాచారం. నిమ్స్ పరిపాలనా విభాగంలో రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు, నిమ్స్ క్యాంటీన్‌లో నలుగురు ఏసీబీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. సర్జికల్ స్టోర్‌లో మందులు, పరికరాల నిల్వలను నలుగురు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల బృందం తనిఖీ చేస్తోంది. ఏకకాలంలో ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. తనిఖీల అనంతరం రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కీలక స్థానాల్లో ఉన్న కొంతమంది అధికారులకు మెడికల్, సర్జికల్ స్టోర్స్ క్యాంటీన్‌లో నుంచి లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై కూడా ఏసీబీ అధికారులు దృష్టిసారించినట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య రావద్దు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఏఐ వినియోగ లక్ష్యం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 05:25 PM