Share News

ఇంకా దొరకని నాగోల్ చిన్నారుల ఆచూకీ.. తెలిపిన వారికి రూ.20 వేల నజరానా

ABN , Publish Date - Nov 08 , 2026 | 04:56 PM

హైదరాబాద్ నగర పరిధిలోని నాగోల్‌లో అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో బాలుర ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు రూ. 20 వేల నజరానా ప్రకటించారు.

ఇంకా దొరకని నాగోల్ చిన్నారుల ఆచూకీ.. తెలిపిన వారికి రూ.20 వేల నజరానా
hyderabad nagole missing boys

హైదరాబాద్, నవంబర్ 8: నగర పరిధిలోని నాగోల్‌లో అదృశ్యమైన ఇద్దరు బాలుర ఆచూకీ ఇంకా లభించలేదు. చిన్నారులు అదృశ్యమై తొమ్మిది రోజులు గడుస్తున్నా.. వారి ఆచూకీ లభించకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాగా.. పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళితే..


నగర పరిధిలోని నాగోల్‌లో సాయిరాం నగర్‌కు చెందిన ఇద్దరు బాలురు వరుణ్ తేజ్(8), మహేశ్(6).. గత నెల అక్టోబర్ 31న అదృశ్యమయ్యారు. ఎంతకీ వాళ్ల ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఐదు ప్రత్యేక బృందాలు చిన్నారుల కోసం గాలిస్తున్నాయి. కాగా.. చిన్నారుల ఆచూకీ తెలిపినవారికి రూ.20వేలు అందజేస్తామని పోలీసులు నజరానా ప్రకటించారు. సమాచారం ఇవ్వాల్సిన నెంబర్లు: 8790968873, 8712662723, 7569078160, 8185886495, 9550497857.


ఈ వార్తలు కూడా చదవండి..

సంక్రాంతి తర్వాత ప్రజాబలం

రావిర్యాల భూములు బ్లాక్‌లో

వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 05:22 PM