హైదరాబాద్‌లో ఇద్దరు బాలుర అదృశ్యం.. ఆచూకీ చెబితే రూ.20 వేల నజరానా
ABN , Publish Date - Nov 08 , 2026 | 04:56 PM
హైదరాబాద్ నగర పరిధిలోని నాగోల్‌లో ఇద్దరు బాలురు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. చిన్నారుల ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు రూ.20 వేల నజరానా ప్రకటించారు.
హైదరాబాద్, నవంబర్ 8: నగర పరిధిలోని నాగోల్‌కు చెందిన ఇద్దరు బాలుర అదృశ్యం కలకలం రేపింది. చిన్నారులు అదృశ్యమై తొమ్మిది రోజులు గడుస్తున్నా.. వారి ఆచూకీ లభించకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే..
నగర పరిధిలోని నాగోల్‌లో సాయిరాం నగర్‌కు చెందిన ఇద్దరు బాలురు వరుణ్ తేజ్(8), మహేశ్(6).. గత నెల అక్టోబర్ 31న అదృశ్యమయ్యారు. ఎంతకీ వాళ్ల ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఐదు ప్రత్యేక బృందాలు చిన్నారుల కోసం గాలిస్తున్నాయి. కాగా.. చిన్నారుల ఆచూకీ తెలిపినవారికి రూ.20వేలు అందజేస్తామని పోలీసులు నజరానా ప్రకటించారు. సమాచారం ఇవ్వాల్సిన నెంబర్లు: 8790968873, 8712662723, 7569078160, 8185886495, 9550497857.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News