ఎంఎంటీఎస్ ప్రయాణికులకు షాకింగ్ న్యూస్
ABN , Publish Date - May 23 , 2026 | 08:57 AM
జంట నగరాల్లోని ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే వారికి షాకింగ్ న్యూస్! సుమారు ఆరు రోజుల పాటు భారీ సంఖ్యలో ఎంఎంటీఎస్‌లు, మెమో రైళ్లు రద్దయ్యాయి.
భారీ సంఖ్యలో రైళ్ల రద్దు
రోజూ 28 సర్వీసుల వరకు..
హైదరాబాద్ సిటీ: జంట నగరాల్లోని ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే వారికి షాకింగ్ న్యూస్! సుమారు ఆరు రోజుల పాటు భారీ సంఖ్యలో ఎంఎంటీఎస్‌లు, మెమో రైళ్లు రద్దయ్యాయి. మే 23, 24, 25, 30, 31, జూన్ 1 తేదీల్లో రోజూ 28చొప్పున ఎంఎంటీఎస్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. వీటితో పాటు ఈ నెల 24న 40 సర్వీసులు, 31న మరో 40 సర్వీసులు రద్దయ్యాయి. అకస్మాత్తుగా శనివారం నుంచి రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే యంత్రాంగంపై ప్రయాణికుల సంఘాలు మండిపడుతున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఎంఎంటీఎస్, మెమూ రైళ్ల రద్దుతో సుమారు వారం రోజుల పాటు జంటనగరాల్లో ప్రయాణికులకు తిప్పలు తప్పేలా లేవు. కాగా, రద్దుకు కారణాలు ఆపరేషనల్ రీజన్స్ అని అధికారులు చెబుతున్నారు. మరోవైపు లోకోపైలెట్ల నియామక ప్రక్రియకు సంబంధించి గ్రూప్-బీ పరీక్షల తేదీలు దగ్గరపడుతుండగా, గ్రూప్-సీ లోకో పైలెట్లు తమ పదోన్నతి కోసం భారీ సంఖ్యలో పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిసింది. అందువల్లనే భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేసినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి:
గోల్డ్ ధరల ర్యాలీకి బ్రేక్.. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
మా వాట్సాప్ గ్రూప్‌లోనూ వైభవ్ గురించే చర్చిస్తున్నాం
Read Latest AP News And Telangana News And International News And Telugu News