గోల్డ్ ధరల ర్యాలీకి బ్రేక్.. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - May 23 , 2026 | 07:13 AM
దేశంలో గోల్డ్ ధరల ర్యాలీకి బ్రేక్ పడింది. ప్రస్తుతం వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు అంచనాలకు అందని రీతిలో మారుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనంగా ఉండటం కూడా లోహాలపై ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో మూడు రోజుల పాటు సాగిన బంగారం ధర ర్యాలీకి నిన్న బ్రేక్ పడింది. ధరలు స్వల్పంగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (మే 23) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,59,480గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,46,190కు చేరింది. నగరంలో కిలో వెండి ప్రస్తుతం రూ.2,95,100 వద్ద కదలాడుతోంది. విజయవాడలో కూడా ప్రస్తుతం ఇవే రేట్స్ కొనసాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఇతర నగరాల విషయానికి వస్తే చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ప్రస్తుతం రూ.1,61,230 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,47,779 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,59,480గా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,46,190గా ఉంది. దేశరాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,59,630గా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,46,540గా ఉంది. చెన్నైలో వెండి (కిలో) ధర రూ.2.95 లక్షలకు చేరుకోగా ఇతర నగరాల్లో రూ.2.85 లక్షల నుంచి రూ.2.90 లక్షల మధ్య కదలాడుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
ప్రభుత్వానికి ఆర్‌బీఐ రూ.2.87 లక్షల కోట్ల డివిడెండ్
ఏపీ, తెలంగాణల్లో కొత్తగా 30 ఒబెన్ ఎలక్ట్రిక్ షోరూమ్‌లు