వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
ABN , Publish Date - May 23 , 2026 | 07:10 AM
దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలపై భారం మరింత పెరిగింది. తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచినట్లు ప్రకటించాయి.
ఇంటర్నెట్ డెస్క్, మే23 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలపై భారం మరింత పెరిగింది. తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచినట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు ఈరోజు(శనివారం) ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.84కు చేరుకోగా, డీజిల్ ధర రూ.100.94గా నమోదైంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇంధన ధరల పెరుగుదల మరింత ఆందోళన కలిగిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం.. ఈ నెలలో ఇది మూడోసారి కావడం గమనార్హం.
వరుసగా ఇంధన ధరలు పెరుగుతుండటంతో రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దాంతో పాటు కూరగాయలు, సరుకులు, ప్రయాణ ఛార్జీలపై కూడా ప్రభావం పడే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, డాలర్ మారకపు విలువలో మార్పులు, కేంద్ర-రాష్ట్ర పన్నుల ప్రభావం వల్ల ఇంధన ధరలు పెరుగుతున్నాయని ఆయిల్ కంపెనీలు పేర్కొంటున్నాయి. అయితే ఇంధన ధరలు వరుస పెరుగుదలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇంధన ధరలు పెరగడంతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్ట్ రంగం తీవ్ర ప్రభావానికి గురవుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగితే సాధారణ జీవన వ్యయం కూడా అధికమయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంధన ధరల నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితుల ఆధారంగా ధరల్లో మరిన్ని మార్పులు ఉండే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ చరిత్రాత్మక రికార్డ్: మంత్రి ఉత్తమ్
కేజీ బేసిన్ గ్యాస్ వివాదం.. రిలయన్స్‌కు సుప్రీంకోర్టులో షాక్
Read Latest Telangana News And AP News And International News And Telugu News