Share News

హైదరాబాద్‌లో మాస్టర్ ‘కీ’ తో స్కూటర్ల చోరీ.. ఇద్దరు నిందితుల అరెస్ట్

ABN , Publish Date - Oct 17 , 2026 | 08:53 PM

మాస్టర్ ‘కీ’తో పార్క్ చేసి ఉన్న స్కూటర్లను దొంగతనం చేస్తున్న ఓ ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టుచేశారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లో మాస్టర్ ‘కీ’ తో స్కూటర్ల చోరీ.. ఇద్దరు నిందితుల అరెస్ట్
hyderabad scooter theft case solved by police

హైదరాబాద్, అక్టోబర్ 17: నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద పార్క్ చేసి ఉన్న ద్విచక్రవాహనాలను మాస్టర్ ‘కీ’ సహాయంతో దొంగతనం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.


పోలీసుల కథనం ప్రకారం.. తంగుటూరి సంజీవ కుమార్(46), మల్లాడ గంగాధర్ శ్రీ నాగవర్మ(49) అనే ఇద్దరు వ్యక్తులు నగరంలోని ప్రధాన కూడళ్లలో, మెట్రో స్టేషన్ల వద్ద నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాలను మాస్టర్ ‘కీ’ సహాయంతో దొంగతనం చేస్తుంటారు. అనంతరం వాటిని వనస్థలిపురంలోని పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. ఒక్కో స్కూటర్‌‌ను రూ.5వేల నుంచి రూ. 10వేలకు అమ్ముతూ జల్సాలకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో అక్టోబర్ 10న ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ నిలిపి ఉంచిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి స్కూటర్‌ను దొంగతనం చేశారు.


ఈ మేరకు బాధితుడు ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా.. నిందితుల గుట్టు బయటపడింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వీరు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎల్బీనగర్, మీర్‌పేట్, అఫ్జల్‌గంజ్, జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ల పరిధిలో వీరిపై పలు కేసులు నమోదైనట్లు గుర్తించారు. కాగా.. నిందితుల నుంచి 15 యాక్టివా స్కూటర్లను స్వాధీనం చేసుకుని.. వాటి యజమానులకు సమాచారం అందించారు. వాహనదారులు తాళం చెవులను వాహనాల వద్ద వదలొద్దని, హ్యాండిల్ లాక్‌తో పాటు జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలు వినియోగించాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి

ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 17 , 2026 | 09:04 PM