Share News

హైదరాబాద్‌లో దారుణం.. మద్యానికి డబ్బులు అడిగిన వృద్ధుడిని కొట్టి చంపిన యువకుడు

ABN , Publish Date - Nov 01 , 2026 | 01:09 PM

హైదరాబాద్‌లోని కవాడిగూడలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి డబ్బులు అడిగాడన్న ఆగ్రహంతో.. ఓ యువకుడు వృద్ధుడిపై దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందారు.

హైదరాబాద్‌లో దారుణం.. మద్యానికి డబ్బులు అడిగిన వృద్ధుడిని కొట్టి చంపిన యువకుడు
elderly man death in hyderabad

హైదరాబాద్, నవంబర్ 1: నగర పరిధిలోని కవాడిగూడలో వృద్ధుడి హత్య కలకలం రేపింది. మద్యం తాగేందుకు డబ్బులు అడిగాడన్న ఆగ్రహంతో వృద్ధుడిపై ఓ యువకుడు అమానుషంగా దాడి చేశాడు. ఈ ఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..


పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. నగరంలోని కవాడిగూడ పరిధిలోని కల్పనా చౌరస్తా సమీపంలోని సాయి రెస్టారెంట్ అండ్ బార్ వద్ద కొంతమంది మద్యం తాగుతున్నారు. ఇది గమనించిన ప్రకాశ్ అనే వృద్ధుడు ఓ యువకుడి వద్దకు వెళ్లి.. మద్యానికి డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరారు. దీంతో ఆ యువకుడు తీవ్ర ఆగ్రహంతో వృద్ధుడిపై దాడికి పాల్పడ్డాడు. ఆయనపై పలుమార్లు బలంగా పిడిగుద్దులు కురిపించాడు. కిందపడిన వృద్ధుడి తలకు తీవ్ర గాయాలు కావడంతో.. అక్కడికక్కడే మృతి చెందారు.


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీం సహాయంతో వివరాలు సేకరించారు. అనంతరం పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో నిందితుడిని.. బన్సీ‌లాల్‌పేట్‌లోని సీసీ నగర్‌కు చెందిన సతీశ్‌గా పోలీసులు గుర్తించారు. కాగా పరారీలో ఉన్న సతీశ్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైస్పీడ్ రైళ్ల మార్గాల ప‌నులను వేగ‌వంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి

ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 01 , 2026 | 01:39 PM