Share News

హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్.. మూడేళ్ల బాలుడి మృతి

ABN , Publish Date - Sep 20 , 2026 | 08:14 AM

హైదరాబాద్‌లోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. కారు ఢీకొట్టడంతో ఇజాన్ ఉద్దీన్ అనే మూడేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్..  మూడేళ్ల బాలుడి మృతి
Hyderabad Hit And Run Accident

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. కారు ఢీకొట్టడంతో ఇజాన్ ఉద్దీన్ అనే మూడేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. బాలుడు రోడ్డు దాటుతుండగా XUV (AP11AN6899) నంబర్ గల కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తన తల్లిదండ్రులతో కలిసి ఐఎస్ఎన్ సదన్ ఎక్స్ రోడ్డు వద్ద ఫ్యూజన్ సిక్స్ వద్ద చాట్ తినేందుకు బాలుడు వచ్చాడు. సీసీటీవీ కెమెరాలో ఈ ప్రమాద దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన బాలుడిని ఆస్పత్రికి తరలించారు.


అయితే, అప్పటికే బాలుడు ఇజాన్ ఉద్దీన్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం ఐఎస్ సదన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని యాకత్‌పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ సందర్శించారు. ఐఎస్ సదన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల విచారణపై కట్టుబడి ఉన్నాం: మహేశ్ గౌడ్

రోడ్ల విస్తరణకు ఇరిగేషన్ అధికారులు ఎందుకు అడ్డం పడుతున్నారు: ఎంపీ రఘునందన్ రావు

హైదరాబాద్‌లో పోలీసుల భారీ ఆపరేషన్.. 425 కేజీల గంజాయి స్వాధీనం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 08:34 AM